For Advertising inquiries Click Here | Are YOU* a Part of our Community? Join us on Facebook! or Subscribe or to recommend
Home
     Register     Login  
తెలుగు
Subscribe

Enter your email address:
<< Newer Older >>
on 2011/2/3 19:07:39

గాంధీ, భగత్‌సింగ్‌లు మరో సారి జన్మించాలి..!


భారత దేశమంటే... టాటా, గోయంకా వంటి దన వంతులే కాదని... పసి తనంలోనే వ్యభిచార కూపాల్లోకి నెట్టబడుతున్న బాలికలు, వెట్టి చాకిరి చేస్తున్న పసి బాలురు, పంటలు కోల్పోయి వేధనతో భర్త పురుగులు మందుతాగి మృతి చెందగా పసి పిల్లలతో వేదన చెందుతున్న మహిళలు ఇలా ... అందరూ కలిసి ఉన్నదే ఈ దేశం. చట్టంపై అవగాహనలేని, అప్పీలుక వెళ్లాలని తెలియని అమాయక ప్రజలు ఈదేశంలో 40శాతానికి పైగా ఉన్నారు. కేసు పూర్వా పరాల్లోకి వెళ్లకుండా, పూర్తి స్థాయి సాక్ష్యాధారాలను పరిశీలించకుండా సాంకేతిక కారణాలతో పేద వారి కేసులు కొట్టివేస్తే... ఇంత కంటే దౌర్భాగ్యం మరోకటి ఉండదని ఈ రోజు హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. మానవతా కోణం నుండి ఆలోచించి ఇచ్చిన తీర్పు న్యాయాలయాల విలువను పెంచుతాయని ఆయన వాఖ్యానించారు. ఈ సందర్భం లోనే ఈ దేశంలో వెలుగు చూడని నల్ల ధనం బయటకు తేవడానికి మరో గాంధీజీ, భగత్‌సింగ్‌లు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. లేబర్ కోర్టులో న్యాయం జరగని పిటిషనర్ గురించి వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి ఈ కామెంట్లను చేశారు. అంతేకాదు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పును వెల్లడించారు.

Related Stories:

 • అప్పల్‌రాజుకు కోత పడింది..!?
 • బాబా ఇక లేరు
 • నేన్నేపుడో చెప్పా మీ మైండ్ సెట్ మారాలని..(Concluded
 • అనుకున్నంతా అయ్యింది..!
 • పార్టీ కన్నా కృతజ్ఞతే ముఖ్యం..!?
 • ‘వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ
 • ఐర్లాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పం
 • మంత్రులకు మూడింది..
 • వామ్మో... జగన్‌ !
 • ముగిసిన నామినేషన్ పర్వం
 • పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
 • కందుల, జగన్ పై పోటికు దిగుతున్నట్టా... లేనట్&
 • కడప కురుక్షేత్రంలోఎవరి బలమెంతంత?
 • జగన్ కు తొలి గెలుపు...!
 • నేటినుంచి రైతుదీక్ష
 • మొండి సర్కార్ మెడలు వంచిన ముసలివాడు..అన్న
 • కమిటీ సూచనలు బెష్
 • ఈ తొక్కలో లింక్ ఎందుకో..!?
 • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
 • పాపం,పోసాని అందరనుకున్నంత పిచ్చోడు కాడు
 • Latest News
 • CM blaming T staff to hide his inefficiency: BJP
 • Trains to run as scheduled on Oct 12-14
 • Ensure power supply to save crops: CM
 • Saudi consulate soon in Hyderabad
 • T Strike to intensify
 • HCS slams centres for Delhi blast
 • Bribery in the form of checks imadhyakalanlo andutunnay!
 • Stalemate continues over Lokpal bill
 • Vijayamma shoots letter to PM
 • Taliban’s attack Chopper, 31 US Commandoes died
 • నడిరోడ్డుపై ధాన్యం.. గోదాముల్లో మద్యం
 • నేటినుంచి రైతుదీక్ష
 • రవితేజ కు కలిసిరానీ విదేశీ యానమ్..
 • గబ్బర్ సింగ్ నిర్మాత మారాడు
 • దాసరి కంట కన్నీరు తెప్పించిన హీరో..?
 • Printer Friendly Page Send this Story to a Friend

  అప్పల్‌రాజుకు కోత పడింది..!?

  2011/2/21 11:41:40

  తాను తీసిన ప్రతి సొల్లు సినిమానీ జనం చూస్తారని నమ్మే రామ్‌గోపాల్ వర్మకు ఈ మధ్య షాక్ ల మీద షాక్ లు తగులుతున్నా పనికి మాలిన మీడియా హడావిడి.. జనం వీక్‌నెస్ ల కారణంగా తన సినిమాలకు హైప్ ఐతే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ విధం గానే కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల రాజు అంటూ హడావిడిగా ఓ సినిమా తీసి జనం మీదకు వదిలాడు. సినిమా విడుదలకు ముందు తెగ కోతలు కోసిన వర్మ ఇప్పుడు మాత్రం తన పాత శైలిలోనే స్టేట్‌మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టాడు కానీ నిర్మాత భయాలు నిర్మాతకు ఉంటాయి కదా. అందుకే నిర్మాత తమ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూపించి సినిమాకు కత్తెర వేయాలని కొరాడట. అయిస్తంగానే రాము దాదాపు 35 నిమిషాల సినిమాకు కత్తెర వెసడట. దీనితో అప్పల రాజు కేవలం 2 గంటల 9 నిమిషాల సినిమాగా మారిపోయింది. ఇక నైనా జనం అప్పల రాజు ను ఆదరిస్తారా.. చూడాలి. అయినా మనలో మాట ఒకసారి ఫ్లాప్ ముద్ర పడిన సినిమాను మాళ్ళీ ఆదరించటం మనకు తెలుసా..!?

  AP News In Telugu : అప్పల్‌రాజుకు కోత పడింది..!?


  బాబా ఇక లేరు

  2011/4/24 7:56:50

  * ఉదయం 6.24 గం.లకు ఆగిపోయిన బాబా హార్ట్‌బీట్
  * రాత్రి నుంచి డయాలసిస్ నిలిపివేత
  * కన్నీటి సంద్రంలో పుట్టపర్తి
  * ఎయిర్‌పోర్టు నుంచి ప్రశాంతి నిలయం వరకు వాహనాల నియంత్రణ
  * భారీగా మోహరించిన పోలీసులు
  * ఆస్పత్రి వద్ద పోలీసుల హడావుడి
  * సత్యసాయి ట్రస్టు నుంచి ప్రముఖ భక్తులకు అందుతున్న సమాచారం
  * హుటాహుటిన పుట్టపర్తికి బయలుదేరుతున్న భక్తులు
  * సత్యసాయి ఆస్పత్రికి ట్రస్టు సభ్యులు
  * రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు
  * బాబా భక్తులు ఎక్కువగా ఉండే చోట తగు జాగ్రత్తలు
  * తీవ్ర మనోవేదనలో బాబా బంధువులు
  * బాబు కడప పర్యటన రద్దు
  * హుటాహుటిన పుట్టపర్తికి బయలుదేరిన చంద్రబాబు
  * పుట్టపర్తికి బయలుదేరిన సీఎం, గవర్నర్ * పుట్టపర్తిలో దుకాణాలు మూసివేయించిన పోలీసులు
  * అనంతపురం: బాబా భక్తురాలు (నారాయణమ్మ) గుండె పోటుతో మృతి

  Source: Andhra Jyothy

  AP News In Telugu : బాబా ఇక లేరు


  నేన్నేపుడో చెప్పా మీ మైండ్ సెట్ మారాలని..(Concluded

  2011/2/12 21:00:47

  అలిపిరిలో తిరుపతి వెంకన్న సాక్షిగా నా మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా గూడా నేనింత బాధ పడలేదు. ఎందుకంటే, మళ్లీ ఎన్నికలలో ఎలా నెగ్గుకు రావాలా అని తల పట్టుకు కూర్చొన్న నాకు, ఆ వెంకన్న దేముడే ఇలా దాడి జరిపించి, చేతికి బ్యాండేజి వేసుకొని, ఎన్నికలకి వెళ్లి గెలుచుకో పో అని అదేసిస్తునాడేమోనని తలచి అర్ధంతర ఎన్నికలకి గంటకొట్టి, నా పదవికి నేనే ఎసరు తెచ్చుకొన్నాను. అది మొదలు నాటినుండి నేటి వరకు నేను ఏనాడూ కంటి నిండా నిద్ర పొయింది లేదు, కడుపు నిండా ఇంత తిన్నది లేదు. అయినప్పటికీ, పని లేని కుక్కకి తీరిక కూడా లేదనట్లు, రాష్ట్రాన్ని ఆ కొస నుండి ఈ కొస వరకు చెడతిరిగేను గాని, అటు ప్రజలని మేల్కొల్ప లేకపోయాను, ఇటు మా జన్నాని హుషారు చేయలేక పోయాను.

  ఎక్కడికి వెళ్ళినా, అందరు ముందుగా నా మైండ్ సెట్ మారాలని నామాట నాకు అప్పచెప్పే వారేగానీ, ఎవరు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవలనుకోక పోవడం నిజంగా విడ్డురం కదూ? నా తెలివి తేటలతో ఆ బుష్షు దొరని, క్లింటను బాబుని కూడా బుట్టలో వేయగలిగేనని ఎంతో మురిసేనుగానీ, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనట్లు, నేను కూడా మన జననానికి పనికి రాకుండా పోతానని ఏనాడు కలలో కూడా ఊహించలేదు. అలాగని బూడిదలో కప్పడిన వజ్రం వంటి నా విలువ నాకు తెలియధనుకోలేను కదా! అందుకే, నా ప్రయత్నాలు నేను చేసుకు పోతున్నాను. గానీ, మధ్యమధ్యలో ఓసారి నా వంటి లోకోపకారికి, నిస్వార్ధ ప్రజా సేవకుడికి, మేధావికైనా అగ్ని పరిక్షలు తప్పవు కదా?

  ""ఏటి సెంద్రబాబుగోరు మీలో మీరే ఏటేటో మాట్లాడేసుకొంటున్నారు? పదవి పోయిన కాడినుండి తవర్ని సూత్తనే ఉన్నా, తవరిలో ఏటో తేడా అగపడుతూనే ఉన్డాది... "

  " ఏయ్ ఎవడ్రా నువ్వు?"

  "ఆయ్, నేనేనండి, మిడిల్ కలాసోడిని.ఆనాడు తవరు ఓటేయమని అడగెందుకు మాకాడికి ఒచ్చి నారుకాదండి? ఆన్నేనండి. మీరలా ఆఫీసులో దిగాలుగా కూర్చోని కానోస్తే, మనసుగ్గబట్టుకోనేక ఇట్టా ఓ పారి తవరిని పలకరించి పోదారని పారొచ్చి నానండి. యేటండయ్యా, అలా దిగాలు పడి వల్లకకూసుంటే, అయినకాడికి మివోల్లే మీ ఎనుక అంతా సక్క బెట్టేసేసి, ఆనాడు మీరు మామ గారూ ఎన్టివోడిని బయటకి అమ్పినట్లే మీకు బయటకి సాగానంపుతారేమో జాగ్రత్త పడండి మరి. ఆనక మీ మాగారల్లె మీరు సేతులు కాలేక ఆకులు పట్టుకొని ఎడసి పయోజనం ఉండదు."
  (నువ్వన్నది కరక్టే అయినా, అది నేను పైకి ఒప్పు కోలేను కదరా సచ్చినోడా?)


  నా కున్న బాధలు సరిపోవన్నట్లు, మధ్యలో ఈ కెసిఆర్ ఒకడు ఓ చేత్తో మా వాళ్ళని ఎగదోస్తునే మరో వైపు నాకు మంట పెడదామని ఓ తెగ ఐడీయాలు చేసి ఏదో రకంగా నన్ను ఇరికించి ఆనందిస్తుంటాడు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో? ఏదో నా రెండు కళ్ళ సిధాంతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చావలేక బ్రతకలేక నా మాన్నాన్ననేను గుట్టుగా రోజులు వెల్లదిస్తుంటే, ఈ కెసిఆర్ పున్యామని చచ్చే చావోచ్చి పడిన్దినాకు. ఆరు నెలలు గరిడి సాము నేర్చి ములన్నున్న ముసలమ్మ మీద కర్ర ఎత్తినట్లు, ఆ కెసిఆర్ ఇప్పుడు నా మీద పడి వెంటనే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టమంటేమిటి? అతని మాట విని నేను ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఇక నా వెనుక మిగిలే యంయల్యేలేందరు? అలాగని పెట్టక పోతే, ఉరువాడ ఏకం చేసి నేను కాంగ్రెస్ పార్టీతో మిలాకత్ అయిపోతున్నాని ఆ కెసిఆర్ టముకు వేసి నా ఉన్న పరువుకుడా గంగలో కలిపెస్తున్నాడు. ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి అన్నట్లుంది నా పరిస్థితి ఇప్పుడు. అయినా, కెసిఆర్ కి తెలంగాణా కావాలంటే డిల్లికి వెళ్లి ఆ సోనియమ్మా కాల్లో పట్టుకోవాలి గానీ, ఇలా నా వెంటపడతాడెందుకో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావట్లేదు?

  గిదో బాబు, నా మాటిన్కొని మా తెలంగాణాకి పార్టీని సపరేట్ చేసి, నా మాదిరస్సంతోన్కి అప్పజెప్పరాదే? ఇక నీజోల్కి ఎవరొస్తారో నే చుస్కొనేతోడినే గందా? నీకా మెత్తగా ఎంత జెప్పినా సమజవుతలేదు. నీకు పార్టీని నడిపేటి తీరు తెల్వదు వేరొకరు సెప్తే ఇన్కోవు? ముందగల నీ మైండ్ సెట్ జర మార్సుకోరాదే?

  ఆ! నువ్వా నాగం?నువ్వు కూడా నాకే పాటాలు నేర్పుతున్నవే గుడ్దోచి కోడినీ వెక్కిరించినట్లు? ఈ నీ తెలివితేటలేవో ఆ కెసిఆర్నినిలువరించేందుకు ఉపయోగిస్తే సంతోషిస్తాను. లేదంటే, అతని దయ వల్ల ఇక మన పార్టీ మిగలదు, మీరు మిగలరు? నా కంటే, నా వ్యాపారాలు నాకున్నాయి. ఎలాగైనా బ్రతికేయగలను, గానీ నీ మాటేమిటి? ఇంత నోరు అంత బొజ్జ తప్ప నీదగ్గర ఏమి తెలివితేటలున్నాయి చెప్పు? రేపు నేను మన దుకాణం కట్టేసే పరిస్థితి వస్తే నువ్వేమి చేస్తావు? వెళ్లి డి.యస్. కాళ్ళు పట్టుకున్తావ లేక ఆ కెసిఆర్ మోచేతికింద నిల్లు తాగుతూ బ్రతుకుతావ చెప్పు? దేవందర్ అంతటోడికే దిక్కు లేక తిరిగి తిరిగి నా పంచన చేరాడు. ఇక నువ్వేపాటి? తోక కత్తిరించేయగలను కబడ్దార్ జాగ్రత్త! నన్నే మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇస్తావా? ముందు నువ్వే నీ మైండ్ సెట్ మార్చుకో, లేకపోతే తోక తెగిపోద్ధి జాగ్రత్త!

  సచ్చినన్రా దేముడ, ఇట్లా ఫసాయిన్చినానేటి? అయినా ఇన్తో పెట్టుకొనుడు నాదే మిస్తేకుల గోడ్తాంది. అన్నా, సేంద్రన్నఅట్లా గోప్పడితే గెట్లన్న? ఏదో మా జనాలు ఓ లొల్లి సేత్తా ఉంటే, ఉర్క సప్పుడు సేయక కుర్సున్నట్టు కొట్టరాదని గట్ల డ్రామా నడిపినా మల్లా, అంతే గానీ మాకేంద్కి లొల్లి? వస్తా మరి, జర ధర్నాలు చేస్కనేదాన్కి పోవాల్నమరి. లేకుంటే, ఆ కెసిఆర్ మడుసులు నా ఇంటికి పేడనీల్లు సెల్లి, గలీజు చేసి పోతారు. వస్తా సెంద్రన్న? జై తెల్గు దేశం. జై సెంద్రబాబు నాయుడు!

  ఆ అట్లా దారికి! అందుకే ముందుగానే అందరి తోకలు కత్తిరించేసి, నా చేతిలో పెట్టు కొన్నానుగదా? ఇక నా మీద తిరుగుబాటు ధైర్యం మా పార్టీలో ఎవడికుంది?

  Where are you going నాగంగారూ? If,you don't mind మీరుకూడా మాపార్టీలోకి జంప్అవొచ్చుకదా Mr.నాగంగారూ?How long can you stick మీ చంద్రబాబు? అసలు మీకు అక్కడ తగిన respect లేదని నాకుతెలిసినా I can't help you with out your interest అనిమీకు వేరేచెప్పలా? What do say నాగంగారూ?ఇప్పుడు మీరుకానీ మా పార్టీలోకి jump అవుతానని నాకు promise చేస్తే రేపే I will go to Delhi and talk to my మేడం సోనియా గాంధీగారు. మీకు,మా తెలంగాణా responsibilities టోటల్గా ఇస్తానని I can't promise but, తప్పకుండ మీకు మాపార్టీ తెలంగాణా అధికారప్రతినిధి postకి చాలా స్ట్రాంగ్గా I will recommend you? ఏమంటారు నాగంగారూ?

  నీకో దండం,నీ హైకమెండుకో దండం బెడ్తగానీ నా ఎనకమాల ఇట్టా తిరగామాకన్నా. నీతో గిట్ల ముచట్లతుండానని ఎవులైన మా బాబుకి సెవిలో ఎసినారే అన్కో, ఇక నాపని ఖతం.అయినా, గిట్ల ఎవులని సూస్తే ఆలేనుకబడుటేన? తంతే బుర్లగంపలబడినట్లు సీదాగా సియం కుర్సిలో బడినోడివి. నీ నసీబ్ సక్కగుంటే మరోఆరునెలలు సక్క్కగా సర్కార్ నడ్ప్కొని మస్తుగా నాల్గు పైసల్ వెనకేసుకోరాదే? అయినా, తుమ్మితే ఉదేటి ముక్కులేకున్న నీపదవి, నీ ప్రభుత్వంలోకి పిల్సుకుపోయేటందుకు వేరేవరు నీకు సిక్కలేదా ఏమి? ఇట్లా నాఎంటబడుతుండే? నీకే దిక్కు లేనోటిడివి మల్లా నా ఉసు నీకెలా కిరనన్న?

  గదేదో సమేత సెప్పినట్లు మెడకో డోలు తిరుగుంది నీపిలుపు.అయినా, నీ పార్టీల సేరేటందుకు నేనేమైన సిరంజివినో కెసిఆర్నో కాదు గందా? నీ పార్టీల నేకేమైన ఇజ్జతుందా నా ఇజ్జత్ గురించి మాట్లాడు తుండావు? కనీసం ప్రజలైన నిన్ను గుర్తు పడ్త లేరు గదా? మరి నీకెలా నాతో ఉసులు?

  what Mr. నాగం గారూ? You are talking rubbish. పోనీ కదా గాలికి తిరుగుతున్నావని పిలిచి పీట వేస్తానంటే You are insulting me. I am already నా రచ్చబండతో become very famous and strong అని మీకు తెలుసు కదా. Now, I can get the appointment of my party high command any time (they wish) you know?

  ఇంతకూ ముందంటే, నేనెవరో ప్రజలకి తెలియదు. గానీ now they gradually start recognising me as CM of the state. ఇంత శ్రమ పడి ఇంత బాధలుపడి నేను రచ్చబండ కార్యక్రమాలు చేపట్టెనుకదా దేనికి అనుకొన్నారు? ప్రజలకి రేషన్ కార్డులు, పించన్లు ఇచ్చేతాన్కి అనుకొన్నారా? Where is money?

  మా రోశయ్య మాష్టారు గల్లపెట్టె కాలిఅయిపోగానే,నాకుఅప్పచెప్పి ఎంచక్కాగా పంచె దులుపుకుపోయి బయట మా ఆఫీసులో కూర్చోనివచ్చిపోయేవారికి పిట్ట కధలు చెప్పుకొంటు టైంపాస్చేస్తున్,నేను ఇంత strain అయ్యి ఈ రచ్చబండ కార్యక్రమం చేసానని మీకు తెలుసు కధ? అయినా, నేను ఇంత కష్టపడి ఈ రచ్చబండ డ్రామా ఎందుకు నడిపెనంటావు Mr.నాగం గారూ?

  Now, I become as popular as late YSR. ఎందుకంటే, ఆ చనిపోయిన ఆ పెద్దమనిషితో నాకు ఎంత close relationship ఉందో అందరికి చెప్పి బాగా popular అయిపోయాను కదా? So, I thought to help people like you. But,జాలిపడి నిన్నుinviteచేస్తే నన్నే ఇన్ని మాటలంటావ Mr.నాగంగారూ?This is too much. It's Ok. మీలాంటి గాలికి తిరిగే వాలతో మాట్లాడే టైం నాకులేదు.వెంటనే ఢిల్లీ రమ్మని మా మేడంగారూ order వేశారు.If,I don't go now immediately, some one will grab my chair. అవసమైతే call చేయండి bye Mr.Nagam గారు.

  ఈ గోషకి అంతేక్కడా?మరిక శెలవా?

  AP News In Telugu : నేన్నేపుడో చెప్పా మీ మైండ్ సెట్ మారాలని..(Concluded


  అనుకున్నంతా అయ్యింది..!

  2011/3/11 21:05:54
  గత కొద్ది రోజులుగా వాతావరణ నిపుణులు భూమికి చంద్రుడు అతి దగ్గరగా రాబోతున్నాడని... కాబట్టి ప్రకృతి సహజ విపత్తులు సంభవించటం జరుగుతుందని చెబుతూనే ఉన్నారు. అయితే వారు ఈ నే 19 వ తేదీన ఆ సంగతనలు జరుగ వచ్చు అని అంటే ఈ రోజే జపాన్ లో విపత్తు సంభవించింది. 2012 సినిమాలో లా ఒకే సారి భూకంపాలు, సునామీ చుట్టుముట్తడం తో జపాన్ కకావికలం అయ్యింది. అణు రియాక్టర్ లకు ఎమర్జెన్సీ ప్రకటించారు.


  జపాన్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.9గా నమోదైంది. దాదాపు 80 వేల మంది చని పోయినట్లు అంచనా. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని మియాగి భూకంపానికి గురైంది. ఆ ప్రాంతాన్ని వరదలు ముంచేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి.


  ఇదిలా ఉంటే లండన్ లోని భూగర్భ, వాతావరణ శాస్త్ర వేత్తలు మాత్రం ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. వచ్చే వారం ఇంకా భయంకరమైన విధ్వంసం జరగనుందని అంటున్నారు. దీనికి కారణం 'సూపర్ మూన్' అని అంటున్నారు. 20 సంవత్సరాల క్రితం మూన్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, ఇది మాత్రమే కాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై లావా భూమిమీద పారుతుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలాగే సూపర్ మూన్ భూమికి దగ్గరగా 1955, 1974, 1992, 2005లో రావడం జరిగింది. దాంతో ఆయా సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు సంభవించాయి.

  AP News In Telugu : అనుకున్నంతా అయ్యింది..!


  పార్టీ కన్నా కృతజ్ఞతే ముఖ్యం..!?

  2011/3/15 17:38:23
  పార్టీ కన్నా తనకు రాజకీయ భిక్ష పెట్టిన వై ఎస్ కు ఆయన కుటుంభానికి కృతజ్ఞతతో ఉండటమే తనకు ముఖ్యం అని అంటుంది సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ జయసుధ. అందుకే కాబోలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విప్‌ను తిరస్కరించింది. కాంగ్రెస్‌ పార్టీలో విప్‌లని ధిక్కరించే సాంప్రదాయం ఉన్నా.. అది బహిరంగంగా వెల్లడించే అవకాశాలు చాలా తక్కువ. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున చీఫ్‌విప్‌ భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేశారు. అయితే దీనిపై సంతకం చేసేందుకు జగన్‌ వర్గానికి మద్దతు ఇస్తోన్న సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ నిరాకరించారు. అందుకు ఆమె చూపిన కారణం మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. రేపు తనకు సినిమా షూటింగ్‌ ఉన్నందున తాను రాలేనని ఎల్లుండి ఓటింగ్‌కు హాజరవుతానని ఆమె చెప్పింది.

  పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనతో పాటు మిత్ర పక్షాలైన ఎంఐఎం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్న నేపధ్యంలో జగన్‌ వర్గం విప్‌ ధిక్కారానికే సై అంటున్నట్లు జయసుధ తీరు చూస్తేనే తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా జయసుధ బాటలో మరెందరు పయనిస్తారో? తమ గెలుపు ఏమవుతుందో అన్న ఆందోళన అభ్యర్ధుల్లో మొదలైంది.
  అయితే ఈ వార్తలను భట్టు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ విప్‌ను సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ తీసుకోలేదన్నది కేవలం అపోహ మాత్రమే, సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని అన్నారు.

  AP News In Telugu : పార్టీ కన్నా కృతజ్ఞతే ముఖ్యం..!?


  ‘వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ

  2011/3/12 13:06:20
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను యువనేత వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.29 గంటల ప్రాంతంలో అశేష జనావళి సాక్షిగా జననేత జెండాను ఆవిష్కరించారు. ముందు నీలం మధ్యలో తెలుపు చివర ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపొందించారు. జెండా మధ్యలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. బొమ్మ వెనుక కాషాయం రంగు ఉంది. బొమ్మ చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. నీలం రంగు యువ చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలుగా తీసుకున్నారు. జెండా ఆవిష్కరణకార్యక్రమానికి జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు.

  జెండా ఆవిష్కరణ కార్యాక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బాబూరావు, శోభానాగిరెడ్డి,కాటసాని రామిరెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ, కొండా సురేఖ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, లేళ్ల అప్పిరెడ్డి, విజయభాస్కరరెడ్డి, నాగార్జున, గోపాల్‌రెడ్డి, పూడి పుల్లారెడ్డి, కుంభా రావిబాబు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

  AP News In Telugu : ‘వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ


  ఐర్లాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పం

  2011/4/20 17:04:17

  యువ నాయకుడు జగన్ స్థాపించిన వై.యస్.ర్. కాంగ్రెస్స్ పార్టీ పట్ల రాష్ట్రంలోనే కాక, పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు వారు కూడా ప్రత్యేకాభిమానం కనబరుస్తునరన్న సంగతి తెలిసిన విషయమే. అంతేగాక, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి సుదూర దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు సైతం మక్కువ కనబరుస్తున్నారు. వారందరు, జగన్ కీ మద్దతుగా ఆయాదేశాలలో వై.యస్.ర్. కాంగ్రెస్స్ పార్టీశాఖలను స్థాపించుకోవడమే గాక, ప్రస్తుతం కడప మరియు పులివెందులలో జరుగుతున్న ఉప ఎనికలలో అతనికి తమ మద్దతు ప్రకటిస్తూన్నారు. ఇటీవల ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్ లో అక్కడ స్థిరపడిన తెలుగువారందరు కలిసి స్థాపించుకొన్న వై.యస్.ర్. కాంగ్రెస్స్ పార్టీ అందుకు ఒక చక్కని ఉదాహరణగా కనిపిస్తుంది.

  ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఘనంగా జరిగింది. యువనేత వైఎస్ జగన్ అభిమానులు వైఎస్సార్ (ఐర్లాండ్) పార్టీని స్థాపించి, పండుగ చేసుకున్నారు. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబానికి తీరని నష్టం చేసిందన్నారు.

  ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం పర్యవేక్షకుడు గురువారెడ్డి మాట్లాడుతూ యువనేత జగన్ పరిపక్వత గల నేత అని కొనియాడారు. వైఎస్సార్ అభిమానులంతా ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. దీపారెడ్డి జనపల్లి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో డి.విజయేందర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ఐర్లాండ్) పార్టీ వ్యవస్థాపకుడు ముత్తుముల జగన్నాథరెడ్డి, సినీ నటి రోజా, తదితరులు పాల్గొన్నారు.

  AP News In Telugu : ఐర్లాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పం


  మంత్రులకు మూడింది..

  2011/4/26 18:00:30 కడప ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయినా గెలువాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు నేడు పెద్ద షాక్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మంత్రులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిభందన లను అడ్డగోలుగా ఉల్లం గించి మరీ ప్రచారం చేస్తున్నారని ప్రాధమిక ఆధారాలు దొరకటం తో ఈసీ కొరడా ఝూలిపించక తప్పలేదు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి గుడ్‌ఫ్రైడే రోజు వారు చర్చిలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేయటం తో పాటు మత ప్రసంగాలు చేశారంటూ మంత్రులు డీఎల్ రవీందర్, అహ్మదుల్లా, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఈసీ నోటీసులు జారీచేసింది.
  కడప ఉప ఎన్నికల్లో మంత్రులు నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుని పరిశీలించిన ఎన్నికల కమిషన్ నలుగురు మంత్రులకు నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల లోపల సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ నోటిస్ పై మంత్రులు పెద్దగా స్పందించకున్నా జగన్ వర్గపు నేతలు మాత్రం తాము ముందు నుంచి చెబుతున్నదే ఇక్కడ జరుగుతుందని చెబుతుంది. ఇదిలా ఉంటే సాక్షి లో వచ్చిన పెయిడ్ ఆర్టికల్స్ పై జగన్ కు ఈసీ నోటీస్ జారీ చేసింది.

  AP News In Telugu : మంత్రులకు మూడింది..


  వామ్మో... జగన్‌ !

  2011/4/8 6:19:05

  సూర్య దిన పత్రికలో ఈ రోజు వచ్చిన ఆసక్తి కరమయిన కధనం

  వందేళ్లకు పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లాలో మరగుజ్జుగా మారింది. గత రెండు ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థులను నిలబెట్టి ఆత్మవిశ్వాసం, తెగువ ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కేవలం ఒక సీటుకు అభ్యర్థిని నిలబెట్టలేక నానా తంటాలు పడు తోంది. కారణం అభ్యర్థి లేక! అక్కడ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ కనుక!! కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వాన్నిసవాల్‌ చేసి, ఆమెను ఎదిరించిన ధీశాలిగా బయటకొచ్చిన వైఎస్‌ జగన్‌పై పోటీ చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకురాని దయనీయ స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ కొట్టుమిట్టాడు తోంది. జగన్‌పై పోటీ చేసేందుకు జిల్లా నేతలు వణికిపోతున్నారు. భయంతో పారిపోతున్నారు.

  కడప పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిని ప్రకటించగా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థి దొరకని దయనీయ పరిస్థితిలో ఉంది. సహజంగా ఎన్నికల్లో టికెట్ల కోసం అంతా పోటీలు పడుతుంటారు. కానీ, కడపలో మాత్రం టికెట్‌ ఇస్తామన్నా అంతా మాకొద్దంటే మాకొద్దంటూ పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కడపలో కాంగ్రెస్‌కు జగన్‌ ఫోబియో ఏ స్ధాయిలో ఉందో స్పష్టమవుతోంది.

  తెలుగుదేశం నేత కందుల రాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు కందుల శివానందరెడ్డిని జగన్‌పై పోటీ చేయించే వ్యూహంతో స్వయంగా ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని పార్టీలో చేర్చుకున్నప్పటికీ... తాము కాంగ్రెస్‌లో చేరతామే తప్ప, జగన్‌పై పోటీ చేసేది లేదంటూ అన్నద మ్ములిద్దరూ చేతులెత్తేశారు. వారిని సీఎం ఇంకా బతిమిలాడుతూనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం బతిమిలాడటం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు.

  ఫలితంగా, మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిపైనే మళ్లీ భారం పడింది. ఆయన పోటీ నుంచి తప్పించు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు. చివరి వరకూ కందుల కుటుంబాన్నే పోటీకి దించాలన్న లక్ష్యంతో వారిపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. రాజమోహన్‌రెడ్డి వద్దంటే కనీసం ఆయన సోదరుడు శివానందరెడ్డినయినా పోటీకి దిగాలని కిరణ్‌, డీఎల్‌ బతిమిలాడుతున్నారు. శివానందరెడ్డి కూడా తన వల్ల కాదని చేతులెత్తేస్తున్నట్లు సమా చారం. ఇక మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తాను మూడోసారి ఓడేందుకు సిద్ధంగా లేనని ముందే అస్తస్రన్యాసం చేశారు. ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఒక్కరే ఎవరూ పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానని ముందుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి పోటీలో దిగడం తప్పేలా లేదు.
  వైఎస్‌ జీవించినంత వరకూ కాంగ్రెస్‌ టికెట్ల కోసం పోటీలు పడిన నాయకులు, ఇప్పుడు టికెట్లు ఇస్తామన్నా తీసుకోకుండా పారిపోతున్నారంటే జగన్‌పై పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేతల్లో భయం ఏ స్ధాయిలో ఆవహించిందో కనిపిస్తోంది.

  ఎన్నికలో జగన్‌ విజయం ఖాయమని, మెజారిటీ గురించే పోటీ జరుగుతోందన్న ప్రచారంతో కాంగ్రెస్‌ నేతలు మానసికంగా భయపడుతున్నారు.అంతకు ముందు... ఉప ఎన్నికలో జగన్‌ సంగతి తేలు స్తామని, కాంగ్రెస్‌ను కాదని పార్టీ గుర్తు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తామని, కడప జగన్‌ సొత్తు కాదని, కాంగ్రెస్‌ వల్లే వైఎస్‌ ఎదిగారు తప్ప, వైఎస్‌ వల్ల కాంగ్రెస్‌ ఎదగలేదని, జగన్‌ ఓటమి ఖాయమంటూ పత్రికల్లో సవాళ్లు గుప్పించిన ఏ ఒక్క నేత కూడా ఇప్పుడు పత్తా లేకుండా పోయా రు. టికెట్‌ ఇస్తామన్నా తీసుకునే దిక్కులేకుండా పో యింది. దానితో వారంతా ఉత్తర కుమారులుగానే మిగిలిపోయారు.
  తాజా పరిస్థితి, కాంగ్రెస్‌ వెను కంజ పరిశీలిస్తే.. రానున్న ఉప ఎన్నికలో పోటీ అంతా జగన్‌- టీడీపీ అభ్యర్ధి మైసురారెడ్డి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థికి మూ డోస్థానమే దక్కేలా ఉందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది.

  AP News In Telugu : వామ్మో... జగన్‌ !


  ముగిసిన నామినేషన్ పర్వం

  2008/5/12 18:54:06
  రాష్ట్రం 18 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికలకు సంబందించి న నామినేషన్ల పర్వం సోమవారం తో ముగిసింది. ప్రధాన పార్టీల తరుపున పోటీ చేస్తున్న అభయార్థులందరు తమ నామినేషన్లను ఇప్పటికే ధాఖలు చేశారు. ఈ సారి ఇండిపెన్డ్ట్ అభ్యర్థుల తాకిడి కూడా బాగానే ఉంది. మంగళ వారం నామినేషన్లను పరిశీలిస్తారు. పోటీ నుంచి విరమించుకొనే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొనే గడువు ఈ నెల 15 తో ముగుస్తుంది. ఈ నెల 31 న పోలింగ్ జరుగుతుంది. జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.

  AP News In Telugu : ముగిసిన నామినేషన్ పర్వం


  పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

  2011/3/30 20:44:59
  భారత్ పాకిస్తాన్ల మధ్య నేడు మొహాలిలో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది . పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది . మ్యాచ్ చివరివరకు కొంత ఉత్కంటగా కొనసాగినప్పటికి భారత్ దే పైచేయని 25 ఓవర్లకే తెలిసిపోయింది. చివరికి పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించి వరల్డ్ కప్ ఫైనల్కి కి మార్గం సుగమం చేసుకొంది .

  ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అత్యంత సంతోషం కలిగించే ఈ శుభవార్తని అందించిన మన భారత్ క్రికెట్ టీం కి మన అందరి అభినందనలు.

  AP News In Telugu : పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం


  కందుల, జగన్ పై పోటికు దిగుతున్నట్టా... లేనట్&

  2011/4/6 21:31:40 వీర ప్రగల్భాలు పలికిన డి ఎల్, మాట్లాడితే నోరు పారేసుకునే తులసి రెడ్డి... ఇంకా చెప్పాలంటే తోక ఒకటే తక్కువ అన్నట్టు ప్రవర్తించే వి హెచ్, ఎం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా అడ్డా గోలుగా మాట్లాడే కేకే... ఎవరూ ఇప్పుడు సాహసం చేయలేక పోతున్నారు. నిన్నటి వరకూ మాదే గెలుపు అని వూదర గొట్టిన నాయకులు ఇప్పుడు లేని పౌరుషం తెచ్చుకుని మాట్లాడుతున్నారు. అయినా నూరేళ్ళ పార్టీ తరపున పోటీ చేయటానికి అభ్యర్డులే కరువు అయ్యారు. అందుకే తమకు శత్రువు అయినప్పటికీ శత్రువు శత్రువు మనకు మిత్రుదె అన్న రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తెదేపా నాయకుల పంచన చేరి పోయారు.

  వైఎస్‌ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు కందుల రాజమోహన్‌రెడ్డి ని తమ పార్టీలోకి నిస్సగ్గుగా ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆది జగన్ పై పోటీ చేయటానికి టికెట్ ఇచ్చి మరి..! తొలుత కడప లోకసభ స్థానానికి దాదాపు ఖరారైనప్పటికీ ఇంకా ఫైనల్‌ కాలేదని ప్రకటించిన కాంగ్రెస్‌ నేతలు టీడీపిలో అసంతృపితో ఉన్న కందుల బ్రదర్స్‌ జగన్‌కి ధీటైన అభ్యర్ధులుగా భావించి వారిని పార్టీలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పులివెందుల నుంచి వివేకానందరెడ్డి పోటీ చేస్తుండగా...కడప లోకసభ నుంచి కందుల రాజమోహన్‌రెడ్డి అభ్యర్ధిత్వం దాదాపు ఖరారైనట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.
  అయితే తాను కాంగ్రెస్ లో చేరటం పై కందుల ఆచి తూచి స్పందిస్తున్నారు. 'కాంగ్రెస్ పార్టీలో మిత్రులు ఉన్నారు. వారు నన్ను కలిశారు. అది వాస్తవమే. అయితే.. కాంగ్రెస్‌లో చేరికపై ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. టీడీపీలో కొంతమందితో నాకు విభేదాలు ఉన్నమాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను అదే పనిగా బయటకు పంపాలని చూశారు. అందుకే బయటకు వచ్చేశా' అని టీడీపీ తరఫున కడప లోక్‌సభ టిక్కెట్‌ను ఆశించిన కందుల రాజమోహనరెడ్డి చెప్పారు. 1996 ఎన్నికల్లో దాదాపు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఓడించేంత పోటీని ఇచ్చానని.. అయితే.. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకూ తేడా ఉందని చెప్పిన ఆయన రాజకీయంగా ఈ మార్పు ఉభయుల నుంచి ఉండవచ్చని అన్నారు. తాను కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పుడే చెప్పడం ఊహాజనితం కావచ్చని అంటూ అయితే తాను పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకుల్లో ఆలోచన ఉందని పేర్కొన్నారు.
  ఇదిలా ఉంటే కందుల కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమం గురువారానికి వాయిదా పడింది. గురువారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కందుల రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అప్పుడే కడప నియోజక వర్గానికి పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించనున్నారు.

  AP News In Telugu : కందుల, జగన్ పై పోటికు దిగుతున్నట్టా... లేనట్&


  కడప కురుక్షేత్రంలోఎవరి బలమెంతంత?

  2011/4/12 10:55:47
  ఉప ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలలో రాజకీయ పరిణామాలు రంజుగా సాగుతున్నాయి. రెండు స్థానాలలోనూ త్రిముఖ పోటీ సాగుతుండగా విజయం ఎవరి వైపు అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. కడప లోక్‌సభ స్థానానికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌), ఎంవి మైసూరారెడ్డి (తెలుగుదేశం పార్టీ), మంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డి (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. పులివెందుల శాసనసభా స్థానం నుంచి దివంగత వైఎస్‌ సతీమణి వై.విజయమ్మ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌), మంత్రి, వైఎస్‌ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి (కాంగ్రెస్‌), బీటెక్‌ రవి (తెలుగుదేశం) పోటీ చేస్తున్నారు. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలలో ప్రధాన అభ్యర్థుల బలాలు, బలహీనతలూ ఇలా ఉన్నాయి....

  వైఎస్‌ వారసత్వం
  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కుమారుడిగా నియోజకవర్గం అంతటా గుర్తింపు....
  వైఎస్‌ వర్గం 70% జగన్‌ వైపే.
  బద్వేలు, ప్రొద్దుటూరు లాంటిని యోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు సైతం ఇటువైపే...
  గత ఎన్నికలలో 1,75,000 వోట్ల మెజారిటీ
  నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ప్రజలతో మమేకం....
  ప్రజల సానుభూతి...
  ఎన్నికల అంచనా ముందే ఉండటంతో ఆరు, ఏడు మాసాల నుంచే నియోజకవర్గంపై దృష్టి
  మండలాల వారీగా టీడీపీ, కాంగ్రెస్‌ వర్గాలను లాగే ప్రయత్నం సఫలం...
  మైదుకూరు నియోజకవర్గంలో మంత్రి డీఎల్‌ వరుస సోదరులు సైతం ఇటువైపే...
  డబ్బు మంచినీళ్ళ ప్రాయం...
  ఆయా ప్రాంతాలను ప్రభావితం చేసే నేతల స్థాయిని బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అప్పగించటం...

  అహంకార ముద్ర
  మైదుకూరులోనే పెదవి విరుపు....
  అహంకారి అనే ముద్ర ఉండటం...
  దురుసుతనం అధికం....
  అధికారులైనా, పాత్రికేయులైనా నిలబడి వినాలి, రాసుకోవాలి.
  వైఎస్‌ను, జగన్‌ను దూషించే తత్వంతో నియోజకవర్గంలోనే ఆగ్రహం...
  మైదుకూరుతో తప్ప ఇతర నియోజకవర్గాలతో సంబంధాలు లేకపోవటం...
  మంత్రి పదవి, అధికారం అనుకూలాంశాలు....
  ఇన్‌చార్జి మంత్రుల కృషి, వైఎస్‌ వివేకా సంపాదించే వోట్లే ఆధారం...
  పలుకుబడే అస్త్రం
  మంచి మనిషి
  వ్యక్తిగతంగా మంచి పేరు
  రాయలసీమ ఉద్యమంతో జిల్లా వ్యాప్తంగా పరిచయాలు
  అవినీతికి పాల్పడని నేతగా పేరు
  ఎంపీ ల్యాడ్స్‌ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించి మంచి పేరు
  నియోజకవర్గంతో సంబంధాలు తెగిపోవటం
  వర్గాలను కూడగట్టకపోవటం
  కందుల సోదరుల నిష్ర్కమణ
  ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అండ
  నాయకులు లేకపోయినా టీడీపీ అభిమానుల బలం

  (ఆధారం: సూర్య దిన పత్రిక)

  AP News In Telugu : కడప కురుక్షేత్రంలోఎవరి బలమెంతంత?


  జగన్ కు తొలి గెలుపు...!

  2011/4/21 18:22:29 వస్తుందా, రాదా అనుకున్న ఉమ్మడి గుర్తు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కు వచ్చింది. జగన్, విజయమ్మలకు కామన్ సింబల్‌గా 'సీలింగ్ ఫ్యాన్'ను గుర్తుగా కేటాయించింది. కాంగ్రెస్ అధిస్తానమే పూనుకున్నా జగన్ కు ఉమ్మడి గుర్తు కేటాయించటం వెశెసమె. ఇది తమకు తొలి గెలుపని జగన్ వర్గం ప్రకటించుకుంది. గతంలో కామన్ సింబల్‌కోసం జగన్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ వర్గం కు అక్కడ చుక్కెదురైంది కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించటం విషేసాం. తమకు గుర్తు కేటాయించటం తో వెంటనే కడప లో జగన్, విజయమ్మ లు తమ గుర్తు తోనే ప్రచారం చేయటం ప్రారంభించారు.
  కడపలో తొమ్మిది మంది జగన్మోహన రెడ్డి లతో పాటు మొత్తం 42 మంది, పులివెందులలో ఆరుగురు విజయమ్మల తో పాటు 24 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకంగా మంత్రులే ప్రచారం చేస్తుండగా, టీడీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగన్ తరపున ఆ వర్గపు నేతలు కష్టపడుతున్నారు.

  AP News In Telugu : జగన్ కు తొలి గెలుపు...!


  నేటినుంచి రైతుదీక్ష

  2011/5/15 13:58:34
  అందరికీ అన్నం పెట్టే అన్నదాత నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. అప్పులు తెచ్చి, ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తూ ఏటా నష్టపోతున్నాడు. ముఖ్యంగా రెండేళ్లుగా దెబ్బమీద దెబ్బతో నలిగిన రైతన్న ఆర్థికంగా కోలుకోవాలంటే మరో నాలుగేళ్ళ సమయం పడుతుంది. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని ఎండగడుతూ అన్నదాత పంటకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో 48 గంటలపాటు రైతుదీక్ష నిర్వహిస్తున్నారు. నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపాన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు ప్రాంగణంలో ఆదివారం ఉదయం పదిగంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు దీక్ష చేయనున్నారు. లక్షలాది మంది రైతుల సంఘీభావంతో చేపడుతున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  భారీ వేదిక, లక్షలమంది కూర్చోటానికి వీలుగా చలువ పందిళ్ళు, పార్కింగ్ ప్రాంతాలు, మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలు, జగన్‌కు ఘనస్వాగతానికి ఏర్పాట్లు.. ఇలా పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. 20 అడుగుల ఎత్తున 40 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో దీక్షావేదిక నిర్మించారు. ధ్యానముద్రలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జగన్ ఆదివారం ఉదయం ఒంగోలు నుంచి రోడ్డు మార్గాన చిలకలూరిపేట మీదుగా ఉదయం పదిగంటలకు నేరుగా దీక్షాస్థలానికి చేరుకుంటారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దీక్ష ప్రారంభిస్తారు. జగన్‌కు మద్దతుగా పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు.

  భారీ బందోబస్తు.. నల్లపాడు రోడ్డులోని 13 ఎకరాల ప్రైవేటు స్థలంలో రైతు దీక్ష జరగనుంది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు హాజరు కానున్న నేపథ్యంలో రూరల్ ఎస్పీ రవిచంద్ర వందమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగిస్తారు. వేదికకు సమీపంలోని మార్కెట్ యార్డు, రెడ్డి కళాశాల, ఆదర్శనగర్ ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

  పలువురు నేతల పరిశీలన
  పార్టీ రాష్ట్ర నేతలతోపాటు ఇతర జిల్లాల నేతలు శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. పార్టీ ముఖ్యనేతలు భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు, నందమూరి లక్ష్మీపార్వతి, జిల్లా నేత అప్పిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజిల్లా నేతలు గౌతమ్‌రెడ్డి, జె.రమేష్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా నేత నవుడు వెంకటరమణబాబు, జిల్లా ముఖ్యనేతలు మాకినేని పెదరత్తయ్య, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, జిల్లా నాయకులు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, గోవిందుని అంజిరెడ్డి, మేరిగ విజయలక్ష్మి పరిశీలించారు.

  source: Sakshi news

  AP News In Telugu : నేటినుంచి రైతుదీక్ష


  మొండి సర్కార్ మెడలు వంచిన ముసలివాడు..అన్న

  2011/4/9 5:15:57

  ఓ 72 ఏళ్ళ ముసలివాడు చిన్నగా ఏ ఆర్భాటం లేకుండా మొదలు పెట్టిన ఒక ఉద్యమం, యావత్ దేశ ప్రజలని ఏకం చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల మన్ననలు పొందింది. అదే, అన్నాహజారే ఢిల్లీలో ఆరంభించిన ఉద్యమం. అవినీతికి వ్యతిరేకంగా లోక్ పాల్ బిల్ కోసం మొదలు పెట్టిన ఉద్యమం. అది కోటాను కోట్ల భారతీయుల ఆకాంక్షలను ప్రతిభింప జేసే మహా ఉద్యమంగా మారి పెను ప్రభంజనమై చివరికి గాడి తప్పిన మన సర్కారు మెడలు వంచగలిగింది.

  అన్నా హజారే గారు పెట్టిన అన్ని షరతులకు కేంద్ర ప్రభుత్వము అంగీకరించినట్లు సమాచారం. కలయో వైష్ణవ మాయయో అన్నట్లు కేవలం నాలుగంటే నాలుగు రోజులలో జరిగిన ఈ మహాద్భుతం,నిజంగా సాకరంయితే ఎలా ఉంటుందో చూడ గలిగేతే భారతీయులుగా మన జన్మ ధన్యమయినట్లే భావించవచ్చు. లోక్ పాల్ బిల్ ఏర్పడి, అవినీతి పరులయిన మన నేతలు, లంచాలు బొక్కే పందికొక్కుల వంటి మన అధికార్లు నిజంగా కటకటాల వెనక్కి వెళ్లి పోతున్నట్లు ప్రజలు అప్పుడే కలలు కూడా కంటున్నారు. పట్టుదలగా ప్రయత్నిస్తే మన దేశాన్ని మనమే మార్చుకోవచ్చని నిరూపించి చూపిన ఆ పెద్దాయనికి శత కోటి వందనాలు. ఆయనకీ ఉన్నంత నమ్మకం, ఆత్మా విశ్వాసం మన వంటి వారందిరికీ కలగాలని ఆ దేముడిని ప్రార్దిదాము.

  ఈ రోజు సూర్య దిన పత్రికలోఆయన గురించి వచ్చిన వచ్చిన కధనం ఇది:
  ‘జన’ విజయం

  అవినీతిపై సంధించిన ‘అన్నా’స్త్రం లక్ష్యాన్ని చేరుకుంది. జనలోక్‌పాల్‌ బిల్లు తేవాలన్న అన్నా హజారే డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తల వంచింది. హజారే అన్ని డిమాండ్లను ఆమోదించింది. 4వ తేదీ నుంచి చేస్తున్న నిరాహార దీక్ష నేటి ఉదయం 10 గంటలకు ఉపసంహరించనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు. ఇది భారత జాతి సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.

  దిగివచ్చిన కేంద్రం ...
  ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. నాలుగు దశాబ్దాలకు పైగా పగడ్బందీ వ్యూహంతంఓ అడ్డుకుంటూ వచ్చిన అవినీతి నిరోధక అస్త్రం లోక్‌పాల్‌ బిల్లును తుంగలో తొక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే అన్నా హజారే ‘దీ’, జన బాహుళ్యం నుంచి వచ్చిన స్పందన ముందు ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సర్కార్‌ తలవంచింది. తుది శ్వాస విడిచే దాకా పోరాటం ఆగదని చెప్పిన హజారే జైల్‌ భరో కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు సిద్ధం కావడంతో స్వయంగా ప్రధాని రంగంలోకి దిగారు. రాష్టప్రతిని కలిసి పరిస్థితిని వివరించారు. ఇంకా జాప్యం చేస్తే ఇప్పటికే మసకబారిన వ్యక్తిగత, ప్రభుత్వ ప్రతిష్ఠలు మరింతగా దిగజారే ప్రమాదముందన్న ఇంకితం పనిచేసింది. హజారే డిమాండ్లను ఆయన ఆమోదం మేరకు ప్రభుత్వం ఆమోదించింది. దీక్ష విరమణకు హజారే అంగీకరించారు. అయితే ఇది తొలి విజయం మాత్రమే...

  న్యూఢిల్లీ: అవినీతిపై పోరులో గాంధేయవాది అన్నా హజారె శుక్రవారం విజయం సాధించారు. హజారె చేసిన అభ్యర్థనలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకున్నది. తాను శనివారం ఉదయం 10.30 గంటలకు తన నిరశన దీక్ష విరమిస్తానని హజారె శుక్రవారం రాత్రి ప్రకటించారు. అవినీతి నిరోధ శాసనం లోక్‌పాల్‌ బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆయన శనివారం తుది నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు.హజారె దూతలు అరవింద్‌ కేజ్రివాల్‌, స్వామి అగ్నివేష్‌ శుక్రవారం సాయంత్రం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌, న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌లతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

  కాగా, టివి వార్తల ప్రకారం, సమర్థమైన లోక్‌పాల్‌ బిల్లు రూపకల్పన కోసం ఏర్పాటు చేయదలచిన సంయుక్త కమిటీకి ప్రణబ్‌ ముఖర్జీ చైర్మన్‌గాను, శాంతి భూషణ్‌ కో-చైర్మన్‌గాను ఉండవచ్చు. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు లాంఛనంగా నోటిఫై చేయను న్నట్లు తెలుస్తున్నది. లోక్‌పాల్‌ బిల్లు రూపకల్పనకు ప్రతిపాదిత కమిటీకి చైర్మన్‌ను, కో చైర్మన్‌ను నియమించాలని అన్నా హజారె కోరారు. న్యాయ మంత్రిత్వశాఖ లేఖ ద్వారా కమిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.

  పౌర సమాజం సభ్యులు, మంత్రులతో ఏర్పాటు చేసే సంయుక్త కమిటీలో ‘కళంకిత’ మంత్రులు ఎవ్వరూ ఉండరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం ఒక ముసాయిదాను పంపింది. ఆ తరువాత హజారె తన ముసాయిదాను పంపారు.‘మేము దానికి సమాధానం ఇచ్చి, దాని గురించి ముగ్గురు మంత్రులతో మాట్లాడాం’ అని స్వామి అగ్నివేష్‌ తెలియజేశారు. ఇది ఇలా ఉండగా, హజారె దీక్ష విషయమై ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌తో చర్చించినట్లు సమాచారం.

  13న ‘జైల్‌ భరో’ ఆందోళనకు హజారె పిలుపు
  అంతకుముందు, జన్‌ లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీ సారథ్యాన్ని పౌర సమాజం సభ్యునికి అప్పగించాలని, కమిటీ ఏర్పాటుకు లాంఛనంగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని తాను చేసిన అభ్యర్థనలను ప్రభుత్వం తిరస్కరించడంతో అన్నా హజారె ఈ నెల 13న దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ ఆందోళన నిర్వహించాలని శుక్రవారం పిలుపు ఇచ్చారు. హజారే ఈ పిలుపు ఇస్తూనే, ఆందోళనను అహింసాయుతంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  ఈ నెల 12న ఈ ఆందోళనను నిర్వహించాలని తొలుత పిలుపు ఇచ్చారు. కాని ఆ రోజు శ్రీరామ నవమి సెలవు దినం కావడంతో ఆందోళనను 13కు మార్చారు. ‘మంత్రి పిల్‌ సిబల్‌తో చర్చలలో పాల్గొనవలసిన వారి నుంచి విషయాలు తెలుసుకున్న తరువాత దేశం అంతటా జైల్‌ భరో ఆందోళన జరగాలని నేను భావించాను. మహాత్మా గాంధిని దృష్టిలో పెట్టుకుని అంతా ఆందోళనలో పాల్గొనాలి. ఎక్కడా హింస జరగకూడదు’ అని హజారె పేర్కొన్నారు. తాను గతంలో మహారాష్టల్రో ఇదేవిధంగా జైల్‌ భరో ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హజారె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  స్వామి అగ్నివేష్‌, అరవింద్‌ కేజ్రివాల్‌లతో కపిల్‌ సిబల్‌ శుక్రవారం ఉదయం సమావేశం కావాలని తొలుత నిర్ణ యించినప్పటికీ చివరకు అది జరగకపోవడంతో హజారె ఈ ప్రకటన చేశారు. చర్చలకు పరస్పరం నిరీక్షిస్తున్నా మని ఉభయ పక్షాలు అంతకుముందు తెలిపాయి. సామాజిక హక్కుల నాయకుల రెండు డిమాండ్లను సిబల్‌ తిరస్క రిస్తూ, పౌర సమాజం సభ్యుడిని చైర్మన్‌గా నియమించాలని పట్టుబట్టిన పక్షంలో లోక్‌పాల్‌ బిల్లుపై సంయుక్త ముసాయిదా కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉంటారని, మంత్రి ఎవరూ కమిటీలో ఉండబోరని కూడా చెప్పారు.

  ‘సంయుక్త కమిటీ ఏర్పాటుపై అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఏమాత్రం లేదు. అయితే, న్యాయ మంత్రిత్వశాఖ, పత్రికా ప్రకటన ద్వారా అధికారిక లేఖ వెలువరించడానికి మేము సుముఖంగా ఉన్నామని వారితో చెప్పాం’ అని సిబల్‌ తెలిపారు.నిరుద్యోగ యువత కూడా ఆందోళనలో పాల్గొనాలని హజారె కోరారు. జైలులో ఉదయం అల్పాహారం, రెండు భోజనాలు ఇస్తారని ఆయన తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజల చేతుకు అధికారాలు సంక్రమించడానికే తన ఉద్యమమని, ప్రతిపాదిత జన్‌ లోక్‌పాల్‌ బిల్లు ఆ దిశగా ఒక ముందడుగు అని చెబుతూ, ఏ కమిటీలోనూ సభ్యుడిని కావాలనే ఆసక్తి తనకు లేదని హజారె స్పష్టం చేశారు. కాగా, కొత్త లోక్‌పాల్‌ బిల్లు రూపకల్పనకై ఏర్పాటు చేసే కమిటీ సారథ్యం కోసం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ వర్మ, జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే పేర్లను సూచిస్తూ తాను ప్రధానికి ఒక లేఖ రాసినట్లు హజారె తెలియజేశారు.

  దేశంలో అవినీతి జాడ్యంపై పోరాడుతున్న సంస్థలను ప్రభుత్వ పరిధిలో ఉంచే బదులు లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకువచ్చినట్లయితే అవినీతిని అరికట్టవచ్చని ఆయన అన్నారు. ‘అవినీతిని అరికట్టవలసి ఉన్న సిబిఐ, నిఘా కమిటీలు, వివిధ కమిటీలు వంటి సంస్థలన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. అవి ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తున్నందున అవినీతికి అడ్డుకట్ట పడడం లేదు’ అని ఆయన చెప్పారు. ‘బోఫోర్స్‌కు ముందు, అనంతరం అనేక పెద్ద కేసులను సిబిఐ దర్యాప్తు చేసింది. కాని, ఏ మంత్రి అయినా లేక ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారి అయినా ఇంత వరకు జైలుకు వెళ్లారా? అలా జరగలేదు. ఎందుకంటే ఎవరైనా కఠిన చర్య తీసుకోవాలని కోరుకున్నా, ప్రభుత్వం సదరు వ్యక్తిని నిలువరిస్తుంది’ అని హజారె పేర్కొన్నారు. ‘అవినీతిని అరికట్టవలసి ఉన్న, ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న సంస్థలను లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకువచ్చిన పక్షంలో అవినీతిపరులు జైలుకు వెళతారు.

  అందుకే ఈ తరహా లోక్‌పాల్‌ను మేము కోరుతున్నాం’ అని హజారె తెలియజేశారు. ‘ప్రస్తుతం దేశంలో అవినీతి పెచ్చుమీరడా నికి రెండు కారణాలు ఉన్నాయి. చట్టాలు బలహీనంగా ఉన్నాయి. అందువల్ల అవినీతిపరులకు భయం ఉండడం లేదు. ఇక రెండవ కారణం - ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిలో చాలా మంది ఈ అవినీతిపరులతో చేతులు కలుపుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మూడవ కారణం కూడా ఉంది. అధికార వికేంద్రీకరణ జరగలేదు. ప్రభుత్వంలో అధికారం కేంద్రీకృతమైనందున అవినీతి పెరిగిపోయింది. అధికార వికేంద్రీకరణ కోసమే లోక్‌పాల్‌ బిల్లు. మా ఉద్యమం కూడా సరిగ్గా అందుకోసమే’ అని హజారె చెప్పారు. ఇది ఇలా ఉండగా, ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధికి అన్నా హజారె లేఖలు రాశారు.

  అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించాలి
  తాజాగా ఈ ఉద్యమానికి ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌ తన మద్దతును తెలిపారు. శుక్రవారం హజారే దీక్షలో పాల్గొంటున్న వేలాది ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘హజారే నిజాయితీ, ఉన్నత వ్యక్తిత్త్వమున్న మనిషని, ఆయన ప్రారంభించిన ఈ అవినీతి నిర్మూలన ఉద్యమంలో తాను ఆయనకు మద్దతుగా నిలుస్తానని’ అని అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చిన విద్యార్థులకు, యువతకు కృత్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవటాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘హజారే నిరాహార దీక్ష ప్రారంభించి నాలుగు రోజులు గడిచిపోయాయని, ఆయనకు మద్దతుగా దేశమంతా నిలిచినప్పటికి ప్రభుత్వం లోక్‌పాల్‌ బిల్లుపై తన వైఖరిని మార్చుకోవటం లేదని.. తన చివరి శ్వాస వరకు అవినీతిపై పోరాడుతానని’ రామ్‌దేవ్‌ అన్నారు.

  AP News In Telugu : మొండి సర్కార్ మెడలు వంచిన ముసలివాడు..అన్న


  కమిటీ సూచనలు బెష్

  2008/5/3 14:55:32
  చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ప్రజప్రతినిదులు అటు పార్లమెంట్ సమావేశాల్లో గాని, ఇటు అసెంబ్లీ సమావేశాల్లో గాని వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజప్రతినిదులు ప్రజలకు జవాబుదారీ తనం వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించి చట్ట సభల్లో మాసాలుతున్న తీరు అభ్యంతరకరమని తెలిసినా ఆ ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో కించిత్తు కూడమార్పు రావడం లేదు. సభ గందరగోళం సృష్టించడం సభ సజావుగా సాగకుండా అడ్డుతగలడంతో సరిపెట్టుకోకుండా సభాపతి ని దిక్కరించి ఆయనను అవమానించే వీడంగా ప్రవర్తించడం సభ మర్యాదను మంట గలాపడం ఆనవాయితీగా మారింది. చట్ట సభ లో తాము ప్రవర్తిస్తున్న తీరును టి. వి. లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోందన్న విషయం తెలిసినా ప్రతి చిన్న దానికి సభ కార్యక్రమం సాగకుండా అడ్డుతగలడం తమ హక్కుగా పరిగణిస్తూ సభ సజావుగా సాగకుండా గందర గోళం సృష్టించడం విలువైన సభ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు పై ప్రజలు ఏవాగించుకుతున్న ప్రజా ప్రతినిదులు మాత్రం 'నవ్వి పొదురు గాని మాకెంటి సిగ్గు' అనుకుంటున్నట్టు ఉంది. సభ ను నిర్వహించడం ఆషా మాషి విషయం కాదు. ఎంతో సహనం , ఓర్పు కావాలి. లోక్ సభ సభాపతి సోమ్‌నాథ్ గాని, అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి గాని సభను అంతో సంయమనం తో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి వారిపై కూడా ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పించడం మానడం లేదు. సురేష్ రెడ్డి కి పక్షపాతం ఆపాదిస్తూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయం లో ప్రదాన ప్రతి పక్షం ఆపాదించడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో సభ్యులువ్యవహారశైలి తో విసిగి పోయిన స్పీకర్ సోమనాథ్ సభ్యులను దారిలో పెట్టడానికి చేసిన సాదారణ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవని గ్రహించి చివరిగా 32 మంది ప్రతి పక్ష సభ్యుల ప్రవర్తన పై విచారణ జరపాలని సభ హక్కుల సంఘాన్ని ఆదేశీంచ్దం గమనిస్తే స్పీకర్ సభ్యుల తీరు పై ఎంత విసిగి పోయరో గ్రహించ వచ్చు. సభ్యుల ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి స్పీకర్ చేసిన యత్నాలన్ని ప్రయోజనం లేకుండా పోవడం స్పీకర్ పదివిని గౌవారించని సభకు సభాపతిగా ఉండటం అనవసరామన్న అభిప్రాయారానికి వచ్చిన స్పీకర్ గతం లో ఒక సారి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించ్‌దం కూడా జరిగింది. అప్పట్లో సభ్యులు తాం అటప్పును గ్రహించి స్పీకర్ కు క్షమాపణలు చెప్పడం సభ్యుల కోరిక మేరకు స్పీకర్ సోమనాథ్ తన నిర్ణయాన్ని వాపసు తీసుకోవడం జరిగింది. ఇంత జరిగిన తరువాత కూడా సభ్యుల వైఖరి లో ఏ మాత్రం మార్పు రాలేదు. దాంతో ఈ సారి సభ్యుల క్రమశిక్షణ రహిత్యాన్ని సహించని స్పీకర్ పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రవర్తన నియమావళి లాంటిది ఉండాలని అభిప్రాయపడినట్లు కనిపిస్తోంది. స్పీకర్ ఆదేశాల మేరకు పార్లమెంటరీ హక్కుల కమిటీ కూడా కొన్ని సూచనలు చేయడం గమనర్హమ్.క్రమశిక్శన తప్పినా సభ్యులను గది లో పెట్టడానికి మొదట హెచ్చ్రించాలని. రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే మండలించాలని అప్పిటికి మార్పు రాకపోతే సభ నుంచి సస్పెండ్ చేయాలని, అయినా మారక పోతే చివరిగా సభ నుంచి బహిష్కరించడమే కాదు సభ్యుల ప్రవర్తన నారంగా భావూస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాదరాదని కమిటీ సిఫార్స్ చేయడం హర్షదాయకం. కమిటీ సిఫార్స్ లు ఆచారంలోనికి వస్తే నైనా సభ్యుల ప్రవర్తన లో మార్పు వస్తోదెమో చూడాలి.

  AP News In Telugu : కమిటీ సూచనలు బెష్


  ఈ తొక్కలో లింక్ ఎందుకో..!?

  2011/3/13 20:20:10
  కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే.. కడప మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహనరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పది రోజుల్లో తీసుకొస్తానని చేనేత శాఖ మంత్రి పి.శంకర్‌రావు చెప్పారు. అక్కడితో ఆగితే బాగానే ఉండేది కానీ... జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకురాలేక పోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను ఆశిస్తున్న వారికి కొత్త ఆశలను రేకెత్తిస్తుంది.

  జగన్ పార్టీ గురించి శంకర్ రావు వాయిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి జగన్ తప్పకుండా తిరిగొస్తారని, ఆయనకు కౌన్సెలింగ్ అవసరమన్నారు. పిల్లవాడిగా జగన్‌లో ఆవేశం, ఆవేదన ఉన్నాయని, రాహుల్‌గాంధీని 2014లో ప్రధానిని చేయాలన్న మాజీ సీఎం వైఎస్ స్ఫూర్తితో జగన్ కూడా పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు... జగన్ చుట్టూ ఐరన్ లెగ్‌లు చేరి ఆయన భవిష్యత్తును పాడుచేస్తున్నారని పరోక్షంగా అంబటి రాంబాబును ఆక్షేపించారు. జగన్‌తో ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్లలేదని, వాళ్ల ఆత్మ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉందని చెప్పుకొచ్చారు.

  ఇవన్నీసరే సార్.. మరి మీ అధిష్టానాన్ని ఎప్పుడు కలుస్తున్నారు అని అంటే... పిలుపు రావాలి కదా.. అని అన్నారు. తెలంగాణా గురించని అనుకుంటున్నారేమో.. మీరు ఒకసారి మేడమ్ తో పార్టీ లోకి జగన్ ను తీసుకుందామని చెప్పొచ్చు కదా... అందునా కేవలం 10 రోజుల్లో జగన్ ను కాంగ్రెస్ లో కి తీసుకు వస్తారాయె.. అని అంటే... అమ్మో మేడమ్ నా... అయినా వారే ఆదేశిస్తే అని అన్నాను కదా... అంటూ కారెక్కెసాడు. అంటే.. జగన్ వెనక్కి రావటం ఇష్టం లేకనే ఇలా అన్నాడా..?
  ఈ గోల ఇలా ఉంటే పుల్లా పద్మావతి లాంటి వాళ్ళు శంకర్ రావు ను కుక్కతో పోల్చి తమ కశి తీర్చుకున్నారు.

  AP News In Telugu : ఈ తొక్కలో లింక్ ఎందుకో..!?


  నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా

  2008/5/12 18:43:26

  మరో నాలుగు నెలల్లో ద్రవ్యోల్భణం అదుపులోని రావచ్చునన్న ఆశాబావాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రంగరాజన్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్భనాన్ని అదుపుచేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్. బి. ఐ. తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఋతుపవనాలు అనుకూలంగా ఉతయన్న సమాచారం ఉందని చెప్పారు. ప్రస్తుతం ద్రవయోభంమ్ అధికంగా ఉన్నా మరో నాలుగు నెలల్లో ఆది 6 నుంచి 5. 44 శాతం తగ్గడానికీ వీలుందని అన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల ఆది స్థూల జాతీయ ఉత్పత్తి పై ప్రభావాన్ని చూపుతోందని అభిప్రాయ పడ్డారు.

  AP News In Telugu : నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా


  పాపం,పోసాని అందరనుకున్నంత పిచ్చోడు కాడు

  2011/4/13 9:48:30

  అడగకనే అందాల విందులు చేసేందుకు తహతహలాడే శెక్సిణి సంజన (అప్పుడెప్పుడో చెడ్డి వేసుకోకుండా మిడ్డితో సభకోచ్చేసిందని ఇలా అనటం లేదు సుమా) ఇటీవల పత్రికల వాళ్ళని పిలిచిమరీ పాపం పోసాని కృష్ణ మురళి మీరందరు అనుకొనంత చెడ్డవాడు, దుర్మార్గుడు కాదని, నన్ను దుశ్సాసన సినిమాలో చాల బాగా చూసుకోన్నాడని చెప్పుకొచ్చింది. ఆయన బాడి లంగ్వాజే తేడా తప్ప మనసు మాత్రం వెన్నపూసట. కావాలంటే మీరు చూడండి, సంజనమ్మ ఏం చెప్పిందో?

  "పోసానితో సినిమా అనేసరికి అంతా తేడా అన్నారు. కోపంగా ఉంటారని, భయపెట్టేస్తారని, ఎక్స్‌ప్రెషన్స్‌కి కష్టపెడతారని..ఏవేవో అన్నారు. బిగ్గరగా అరుస్తూ మాట్లాడినా..చూడడానికి కటువుగా ఉన్నా.. ప్రాక్టికల్‌గా చాలా స్వీట్‌ పర్సన్‌. ‘ఇక్కడికి రామ్మా...అక్కడకు వెళ్లమ్మా..’ అన్నంత సున్నితంగా, ప్రేమగా సన్నివేశాన్ని వివరించేవారు. సహజంగా చేసెయ్‌..టెన్షన్‌ లేకుండా! అదే బాగా వస్తుంది...అని సెట్స్‌లో ప్రోత్సహించేవారు. చూసి నేర్చుకునే గుణముందని చాలాసార్లు మెచ్చుకున్నారు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో వెరీ స్పెషలిస్ట్‌ ఆయన."

  (సూర్య దిన పత్రిక)

  AP News In Telugu : పాపం,పోసాని అందరనుకున్నంత పిచ్చోడు కాడు


  The comments are owned by the poster. We aren't responsible for their content.
  Poster Thread  Follow Us
         

  Copyright Content οΏ½ 2013 by Bharat Waves  |